• PRACHINA AAYURVEDA AROGYA RAHASYALU 250 x 375

    Prachina Ayurveda Arogya Rahasyalu

    400.00

    మన భారతదేశంలో అత్యంత పవిత్రమైనవి వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని ఇవి నాలుగు. వీటిలో చివరిదైన అధర్వణ వేదం మిగిలిన మూడు వేదాలకన్నా ఒక ప్రత్యేకతను విశిష్టతను సంతరించుకుంది. ఈ  అధర్వణవేదంలో ఎన్నో రకాల ఔషధులు వాటి ఉపయోగాలు, వివిధ రకాల రోగాలను నివారించే మంత్ర, తంత్ర, మూలికల విజ్ఞానం పొందుపరచబడింది. ఆయుర్వేదం అనేది ఈ అధర్వణ వేదంలో అంతర్గతంగా చెప్పబడిందే. షడ్డర్శనాలైన సాఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పుర్వమీమాంస, ఉత్తరమీమాంస మరియు జ్యోతిషం, వంటి శాస్త్ర గ్రంథాల మీద ఆయుర్వేదం ఆధారపడి వుందని పండితులు చెప్తారు. దేవవైద్యుడైన ధన్వంతరి ఆయుర్వేద విజ్ఞానానికి మూలపురుషుడుగా పూజించబడుతున్నాడు.

                   శరీరం, ఇంద్రియాలు, ఆత్మ కలసి ఉండటమే ఆయువు. ఈ ఆయువును పొందటం దీని గురించి తెలుసుకోవటం అనే దాన్నే ఆయుర్వేదం అంటారు. ఈ ఆయుర్వేదంలో శరీరతత్త్వాలు, ఋతుచర్యలు, రోగ నిర్ధారణా పద్ధతులు, రోగాలను నివారించే వివిధ రకాల మూలికా చికిత్సలు, శాస్త్ర చికిత్సలు వంటి ఎన్నో విశేషాలు పొందుపరచబడ్డాయి ఇంత గొప్పదైన ఆయుర్వేదాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చిన మహా వైద్యులు ఎందరో వున్నారు.

                                                                                                                   – డా. జయంతి చక్రవర్తి

    Buy nowBuy Now
  • RUSSIAN CLASSICS 250 x 375

    Russian Classics

    225.00

    రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.

                           రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.

    Buy nowBuy Now
  • UPAVASAM 250 x 375

    Upavasam By Dr Jason Fung

    100.00

     చాలామంది దృష్టిలో “ఉపవాసం” అనే మాట ఎదో మత ఆచారానికి సంబంధించిన వ్యవహారాం. అత్యధిక ప్రధాన మతాలు ఉపవాసాన్ని ఎదో ఒక సందర్భంలో ఆచారంగా ప్రబోధిస్తాయి. హిందువులు శివరాత్రి నాడు, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లోనూ, మహ్మదీయులు రంజాన్ మాసంలోను ఉపవాసం ఉంటారు. బౌద్దులు, జైనులు, యాదులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం కేవలం శరీరాన్నే కాకుండా మనసును కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు.

                              ఉపవాసం ఆరోగ్యాన్ని మురుగుపరుస్తుందని, జీవన కాలాన్ని పెంచుతుందనే విషయం గత కొద్దీ కాలంగా వైద్య వర్గాల చర్చలకు కేంద్ర భిందువైంది. ఉపవాసం వలన రక్తపోటు, రక్తంలో చెక్కర స్థాయిలతో పాటు ఇతర జీవక్రియల ప్రమాణాలన్నీ మెరుగవుతాయని రుజువయింది. ఉపవాసానికి తక్కువ పిండి పదార్ధాలు, ఎక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం తోడైతే అద్భుతమైన ఫలితాలనిస్తాయని కూడా నిర్ధారణ అయింది.

    Buy nowBuy Now
  • geeta saram navajeevana vedam 250 x 375

    Geetha Saram Navajevana Vedam

    260.00

    ఎక్కడ కృష్ణుడు (డాక్టరు), అర్జునుడు (పేషెంటు) ఉంటారో అక్కడ ఆరోగ్య భాగ్యమస్తు!

    సంఘంలో ఒక్క డాక్టరుకు మాత్రమే ప్రతి వ్యక్తినీ కలిసే అవకాశం ఉంది. రోగం లేని జీవుడు లేడు. డాక్టర్ అవసరంలేని రోగి లేదు. రోజు గడచినకొద్దీ రోగం ముదురుతుంది. ఖర్చు పెరుగుతుంది. డాక్టరు, పేషెంటు ఇరువురు మధ్య కావలసిన పరస్పర అవగాహనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని డాక్టరు (కృష్ణుడు) హాస్పిటల్ (యుద్ధ రంగం) లో పేషెంట్ (అర్జునుడు) అడుగు పెట్టగానే “గీతా సారం, నవజీవనవేదం” తో ఆహ్వానిస్తాడు. పేషెంట్ (అర్జునుడు) డాక్టరుకు (కృష్ణుడికి) సర్వస్య శరణాగతుడై రోగ లక్షణాలను (శత్రువు) పూర్తిగా వివరిస్తాడు. కృష్ణుడు తొట్రుపాటు లేకుండా అనర్థకంగా అర్జునుడికి గీతాబోధచేస్తాడు (అంటే చేయవలసిన విధులు, విధానాలు, టైము, ఖర్చు, హాస్పిటల్లో చికిత్స పూర్తి అయిన తర్వాత మనసుకు ప్రశాంతత కూర్చేది భగవద్గీత an old-fashioned way. మానవ ప్రయత్నానికి పరమాత్మ సహాయం తప్పక ఉంటుంది. వైద్య వృత్తికి కొద్దిపాటి పెట్టుబడి. వైద్య సిబ్బంది కర్తవ్య పాలనమీద మనసు కేంద్రీకరిస్తారు. వైద్య వృత్తి సేవావృత్తి. సమాజాభివృద్ధిలో డాక్టర్ భాగస్వామ్యానికి విలువ ఎక్కువ. ఈ చిరుకానుక ద్వారా వైద్య సేవాశక్తికి రెక్కలొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొంతలో కొంత మారుస్తూ మొత్తం సమాజాన్నే మార్చే అవకాశం ఉంది ఒకనాటికి. కాబట్టి వారే సమాజాన్ని మార్చగలరు.

    ధ్యానము, ప్రాణాయామం, యోగా, అభ్యాసము వలన ఉపయోగాలను చక్కగా చెప్పింది “గీతాసారం”. ధృఢ సంకల్పం, కర్తృత్వ భావనలేని కర్తవ్య నిర్వహణ, స్వార్థంలోనే పరమార్ధంగా నేటి దైనందిన జీవితంలో కొందరు ఎలా చేస్తున్నారో ఉదాహరణలున్నాయ్ “గీతాసారం”లో. ఏకాగ్రత, బుద్ధి కుశలత, పట్టుదల, సహనం, సంయమనం, అలవరచుకొని కొంతమంది కోపాన్ని ఎలానియంత్రించుకుంటున్నారో “గీతాసారం”లో ప్రస్తావించడం అయినది. అధ్యాయాలుగా ఉన్న భగవద్గీత జ్ఞానభాండాగారం, మనకు కావలసినది ఎక్కడ ఉందో వెదికి దానిని అర్థం చేసుకొని మనకు అన్వయించుకొని ఆచరించడం సామాన్యులకు అయ్యే పనికాదు. అందువల్లనే “గీతాసారం” వివిధ విషయాలుగా వర్ణించడము అయింది. ఏ విషయం కావాలన్నా ఎవరైనా ఎప్పుడైనా చదువుకొని ఆచరణలో పెట్టడానికి రోజువారీ భాషలో “గీతాసారం” అందిస్తోంది………….

    Buy nowBuy Now
  • kathalela raastaru 250 x 375

    Kathalela Rastaru? ? By Sarvari

    300.00

    కాబోయే కథకులకి పనికొచ్చే చిట్కాలు

    – ఆరుద్ర

    “మనం చదివే చాలా కథలకన్నా మనం రాసే కథలే మనకి బాగుంటున్నాయి, అయినా మనం పంపించే కథలు ఈ పత్రిక వాళ్ళు ప్రచురించరేం?” అని మీ రెప్పుడైనా బాధపడ్డారా? ఇప్పుడు పడుతున్నారా? పడకండి ధైర్యం చేతబట్టుకొని, కాళ్ళు నిలదొక్కుకోండి.

    మీరు పంపించే కథలు మీ కొక్కరికే బాగుంటే చాలదు. అందరికీ బాగుండాలి.. అప్పుడే సంపాదకులు వాటిని ప్రచురిస్తారు. బాగున్న కథల్ని పత్రికలవాళ్ళు కళ్ళకద్దుకుని మరీ ప్రచురిస్తారు. వేసినవాటికి తృణమో, పణమో పారితోషికం కూడా ఇస్తారు. (పూర్వం రమారమి తృణమే ఇచ్చేవారు, ఇప్పుడు పణం ఇస్తున్నారు.)

    బాగా వుండేటట్టు కథ రాయాలంటే దానికి అనుభవం కావాలి.

    “చాల్లేవయ్యా! ఆపాటి అనుభవం మాకూవుంది. ఊఁ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచి కథలు వింటున్నాం. కూడబలుక్కొని చదవడం మొదలెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కాంపోజిషన్లు రాయడం మొదలెట్టిన మర్నాటి నుంచి కథలూ రాస్తున్నాం, ఇంతకన్నా ఇంకేం కావాలి?” అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవ ముందని తప్పకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచి కథలు వినాలనీ, చదవాలనీ, వ్రాయాలని తహ తహ వున్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి.

    భాగవతం రాసిన బమ్మెర పోతరాజుగారు మాత్రం ఎలా రాశారు? విభుదవరుల ఎల్ల విన్నంత, కన్నంత తెలియవచ్చినంత తేటపరిచారు. ఆహా! దొరికింది కిలకం. ఇది మంచి కథలు రాయడానికి సూత్రం! కథ రాసేవాడు ముందు బోలెడంత వినాలి. లాకాయి,………

    Buy nowBuy Now
  • madivippina charitra 250 x 375

    Madi Vippina Charitra

    250.00

    గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
    చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు.

    Buy nowBuy Now
  • maranam 250 x 375

    Maranam By Sadhguru

    300.00

    మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే
    కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి
    మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.

     చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .
    మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే
    అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు
    ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే

    అనుకోండి… అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ
    ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన

    కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?
    మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!

    అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం
    గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి

    విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక
    అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన
    మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి
    మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,
    మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా
    మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన

    విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.

    ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,
    పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క
    మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ

                 చదవవలసిన పుస్తకం ఇది,

    Buy nowBuy Now
  • memukuda charitra nirmincham 250 x 375

    Memu Kuda Charitra Nirmincham By B Anuradha

    350.00

    అవును… చరిత్రనే సృష్టించారు
    ఇంగ్లిష్ అనువాదానికి ముందుమాట –

    వందనా సోనాల్కర్

    “ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి మా ఊరి నది దగ్గర కున్బీలకు, మహార్లకు వేరు వేరు బండలు ఉన్నాయి. అయినా నేను కావాలనే కున్బీల బండ దగ్గరకెళ్ళి నా బట్టలు ఉతికాను. మరుక్షణం నలుగురు కున్బీ ఆడవాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి ‘ఏయ్ మహార్నీ నీకు కళ్ళేమైనా దొబ్బాయా? ఇది మా బండ అని తెలియదా నీకు?’ అని అరిచారు.

    ‘ఎవర్నే మహార్నీ అంటున్నారు? ఏం…నా బట్టలు ఇక్కడ ఉతికితే ఏమవుతుంది? కావాలంటే మీ బండ మీద నీళ్ళు పోసి శుద్ధి చేసుకోండి’ అన్నాను. వాళ్ళు వెంటనే ‘ఎంత పనికిమాలిన ఆడదానివి నువ్వు’ అనేసరికి నేను కోపం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళల్లో ఒకామె జుట్టు పట్టుకున్నాను. నన్ను మహార్నీ అని ఎవరైనా పిలిస్తే నాకు మహా కోపం వస్తుంది. అలా పిలిపించుకోవడం నాకు చెడ్డ అసహ్యం. పెద్ద గొడవయ్యింది. వాళ్ళు నలుగురు ఉన్నారు. నేను ఒక్కతిని. అయితేనేం నేను ఒక్కదాన్ని చాలదా వాళ్ళకు జవాబు చెప్పడానికి. ఇంతలో మా మామగారు జోక్యం చేసుకుని గొడవ ఆపారు.”

    “నా మొదటి గీతం నేను భీమ్ కోసం పాడతాను

    నేను సత్యాగ్రహంలో పాల్గొని, ఆయన్ని దగ్గరనుండి చూస్తాను.

    నా రెండవ గీతం అతనికే

    మాకు నీరు తోడుకొనే హక్కు ఎవరు ఇచ్చారో

    ఆయన కారణంగానే, బాయి, మేము ఈ వ్యాన్లో సంతోషంగా ఉన్నాము. నా మూడవ గీతం,

    ప్రజలందరినీ ఆనంద వధువులా చేసిన

    రమా ఆయి స్వామికి”,

    మొదటి పేరాలో ఉటంకించిన సంఘటన ఈ పుస్తకం రెండవ భాగంలో ఉన్న దళిత మహిళల ఇంటర్వ్యూల నుండి తీసుకున్నది. ఒక మహార్ మహిళ అటువంటి పని చేస్తే ఈ రోజైనా అలాంటి ప్రతిస్పందనే ఎదురవ్వొచ్చు. భారత గ్రామీణ జీవిత వాస్తవికత……………

    Buy nowBuy Now
  • pravahinche uttejam Che guvera 250 x 375

    Pravahinche Uttejam Che Guevara By Katyayani

    200.00

    “చేగెవేరాని ” క్యూబా విప్లవానికో, బొలివియా పోరాటానికో పరిమితం చేసి చూడలేము. తను విప్లవ స్వప్నాల్ని ప్రపంచరీకరించిన భావుకుడు, విప్లవకారుడు. గెరిల్ల యోధుడు, అరుదైన నాయకుడు.. జీవన్మరణాలు రెంటికి సార్ధకత ఉండాలని తపించిన మనిషి.. అతని జీవితం లోని సమకాలీన ప్రాధాన్యతను మళ్లీ మన ముందుకు తెచ్చేదే ఈ రచన.

    Buy nowBuy Now
  • SATAVASANTALA GHANTASALA 250 x 375

    Sathavasamthala Ghantasala

    500.00

     శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన” అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.

    -శ్రీశ్రీ

    అతడు కోట్ల తెలుగుల ఎద
    అంచుల ఊగిన ఉయాల
    తీయని గాంధర్వ హేల
    గాయకమణి ఘంటసాల

    – డాక్టర్ సి. నారాయణ రెడ్డి
    ఘంటసాలవారి కమనీయ కంఠాన
    పలుకనట్టి రాగ భావమేది!
    ఘంటసాలవారి గాన ధారలలోన
    తడియనట్టి తెలుగు టెడద యేది!

    – దాశరధి

    చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
    తళతళ మెరయు గంధర్వతార
    తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
    వేలకొలది గీతమ్ముల నాలపించి
    ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
    కంఠకర్తారమాల! మా “ఘంటసాల!”

    – కరుణశ్రీ

    Buy nowBuy Now
  • dargamitta kathalu 250 x 375

    Dargamitta Kathalu & Poleramma Banda Kathalu

    390.00

    చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, గొప్ప గొప్పవాళ్ళని, ముక్కూ ముఖం ఎరగని చాలా మందిని ఆత్మీయులుగా నాకు చేరువ చేసిన కథల పుస్తకాలివి. ఏ పూట ఏ మూలకు వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే కల్లాకపటం ఎరగని ఎన్నో కుటుంబాల నిచ్చిన పుస్తకాలు. ఒక రకంగా నా ఆస్తిపాస్తులు. వీటిని చదివి, చదువుతూ, ఇది రాస్తున్న ఈ క్షణాన కూడా ఏదో ఒక మూల ఎవరో ఒకరు చదువుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి ముఖాన నవ్వు… కంట కన్నీరు… గుండెల్నిండా ఈ కథల పట్ల ప్రేమ… ఇంకా ఏం కావాలి నాకు?

                ‘దర్గామిట్ట కథలు’ చదివిన పాఠకులు కొందరికి ‘పోలేరమ్మ బండ కథలు’ తెలియవు. ‘పోలేరమ్మ బండ కథలు’ చదివిన కొందరికి ‘దర్గామిట్ట కథలు’ ఉన్నట్టుగానే తెలియవు. ఆశ్చర్యం ఏమిటంటే మొదట ఎవరు ఏది చదివితే అదే ఇంకొకదాని కంటే బాగుందని వాదనకు దిగడం. ఈ తకరారు ఎందుకు? రెండు కలిపి చదువుకుంటే బాగుంటుంది అని ఇలా. నాకెంతో ఇష్టమైన కథలు ఇంకా ఇష్టంగా మీ చేతుల్లో పెడుతున్నాను.

    – మహమ్మద్ ఖదీర్ బాబు

    Buy nowBuy Now
  • decoding the leader 250 x 375

    Decoding the Leader By Dr Peddi Rama Rao

    150.00

    గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్

    రాజమౌళికి కోటి రూపాయలిచ్చి సినిమా తీయమన్నా
    మనుకోండి! మిమ్మల్ని ఎగాదిగా చూసి కత్తిలాంటి ఒక
    కొత్త ఆయుధం తయారు చేయించటానికి కూడా ఈ కోటి
    సరిపోవూ అంటాడు.

    ఆయన ఊహాశక్తికి తగ్గ స్థాయిలో సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలో ఆయనకు కూడా తెలియదు. తన ఊహాశక్తికి తగ్గట్టుగా ఆయన తీస్తూ పోతే, ప్రొడ్యూసర్ కూడా అట్లానే డబ్బులు పెడుతూపోవాలి. చంద్రబాబుగారు కూడా అంతే! తన ఊహాశక్తికి తగ్గ స్థాయిలోనే ఏ పనైనా జరగాలని తపన పడతారు.

    అప్పటికింకా అమరావతి శంకుస్థాపన కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనప సామాను కింద వేలం వేసి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే గూగులమ్మనడిగితే హావ్ లాక్ బ్రిడ్జ్ పొడవు మూడు కిలోమీటర్లని, గోదావరి నది మీద అటు కొవ్వూరునీ, ఇటు…………..

    Buy nowBuy Now
  • kishan chandar 250 x 375

    Kishan Chander Enika Chesina Kathanikalu By R Chandrasekhara Reddy , Jai Ratan

    200.00

     కిషన్ చందర్ కథలను అనువాదం చెయ్యడం నాకు గొప్ప అనుభూతి. మనకు తెలియని జీవిత పార్శ్వలను కొన్ని ఆవిష్కరిస్తే మరికొన్ని మనకు తెలిసిన విషయాలనే కొత్తగా ప్రదర్శిస్తాయి. వాస్తవికత కళాత్మకతల కలనేత కిషన్ చందర్ కథానికా సాహిత్యం. దేశ విభజన నాటి విషాదాలను, యుద్ధానుభవాలను, అరుదైన మానవ సంబంధాలను మనం కిషన్ చందర్ కథలలో చూడవచ్చు . అంతేకాదు మనిషి విలువలను విస్మరించిన మనకార్య నిర్వహణ వ్యవస్థ నగ్నరూపాన్ని కూడా కొన్ని కథలలో చదివి నిబిడాశ్చర్యంలో మునిగిపోతాం. మౌఢ్యం మన జాతిని ఎలా వెర్రిదానిని చేస్తుందో తెలుసుకుంటాం.

                                                                                                 – జై రతన్, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

    Buy nowBuy Now
  • maa kathalu 2022 250

    Maa Kathalu 2022 By Ch Sivarama Prasad

    99.00

    అనామిక

    – గడ్డం దేవీప్రసాద్

    హఠాత్తుగా పెద్ద వర్షం కురవడంతో రోడ్డుపై నడుస్తున్న నేను పరుగెత్తి ఓఇంటి తలుపు దగ్గరగా వెళ్ళి నిలుచున్నాను. తల తడవలేదు కానీ వర్షం ఏటవాలుగా పడుతున్నప్పుడు ప్యాంటు తడుస్తోంది. పూణేలో ట్రైనింగ్ కోసం వచ్చిన నేను మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడంతో ఇక్కడి ఒక పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న గౌతమ్ అనే మిత్రునితో కలిసి అతని బండిపైన తిరుగుతూ ఓషో ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలస్ చూసి దగ్గుషేత్ గణేష్ మందిరానికి వచ్చాము. ఇంతలో గౌతమ్కు వాళ్ళ ఎస్.ఐ. నుండి ఫోన్ వస్తే త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు.

    “అందరి ఆ! భారీ బారిష్ హెరాహీ హై ఇస్తే అభి హిట్ న హెూనే దో” లోపలికి రండి. వర్షం ఎక్కువగా వస్తోంది. ఇది ఇప్పట్లో తగ్గదు) అంటూ ఒకామె తలుపు తీసి లోనికి రమ్మని చెప్పింది. నేను తప్పనిసరి పరిస్థితిలో లోనికి వెళ్ళాను………….

    Buy nowBuy Now
  • mahabhaaratam 250 x 375

    Mahabharatham By D Srinivasa Dikshitulu

    126.00

    వేదవ్యాస మహర్షి

    మహాభారతమ్

    ఆదిపర్వం

    శౌనక మహర్షి నైమిశారణ్యంలో సత్ర యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని చూడటానికి చాలామంది మహర్షులు వచ్చారు. సూత వంశానికి చెందిన ఉగ్రశ్రవుడు కూడా వచ్చాడు.

    పురాణ కథల్ని వీనుల విందుగా చెప్పటంలో సూతుడు దిట్ట. నైమిశంలోని మహర్షులు సూతునికి అతిథి సత్కారాలు చేశారు. దర్భలతో నేసిన చాపమీద సూతుడు కూర్చున్నాడు. శౌనకుడు మొదలైన మహర్షులు ఆయన చుట్టూ చేరారు. ఎక్కడి నుంచి వస్తున్నావని సూతుని అడిగారు.

    “మహర్షులారా ! పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. ఆయన చేసిన సర్ప యాగానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వ్యాసుడు రాసిన భారతంలోని కథల్ని వైశంపాయనుడు చెప్పగా విన్నాను” అన్నాడు సూత మహాముని.

    “అయితే… ఆ మహాభారత కథనే మాకూ వినిపించు” అన్నారు మహర్షులు…………………..

    Buy nowBuy Now
  • nemaru 250 x 375

    Nemaru By Dusanapudi Vanidevi

    350.00

    బద్ధకిష్టుడు!

    పెద్ద నాలుగయిదు రోజులకొచ్చేసింది.

    తెల్లారుజాము నాలుగింటికే ఊరు ఊరంతా జూలు విదిలించింది.

    పేడ కల్లాపులూ, ముగ్గులు, గొబ్బిళ్ల హడావిడి పుంజుకుంది.

    నొక్కుల జుట్టూ పచ్చని చాయా – లావూ సన్నం కాకుండా కాస్త పొట్టిగా ఉన్న ముప్పయ్యేళ్ల యువతి-నిండు గర్భిణి!-ఇంటి ముందు రథం ముగ్గేస్తోంది. అయిదుగురు కొడుకులు తల్లి ఆమె! ఈసారయినా ఓ ఆడపిల్ల పుట్టి, ముందుముందు ముగ్గులూ, గొబ్బిళ్లూ, బొమ్మల కొలువుల హడావిడి నెత్తినేసుకోవాలన్నది ఆమె చిరుకోరిక.

    అరుగుమీద కూర్చుని అక్క వేస్తున్న ముగ్గును చూస్తున్నాడో పదహారేళ్ల బక్కపలచని, చామనచాయ కుర్రాడు. పుష్యమాసపు చలికి గొంతుక్కూర్చుని, చేతులు రెండూ కాళ్లకి పెనవేశాడా కుర్రాడు. ముగ్గు పూర్తవుతూండగా, ఆమె కడుపులో ఏదో కదిలినట్టైంది. పళ్లబిగువున చేతిలో పని పూర్తిచేసింది. ముగ్గు బుట్ట అరుగుమీద పెట్టిన అక్క మొహంకేసి అనుమానంగా చూశాడా కుర్రాడు.

    ‘అక్క మొహం మామూలుగా లేదివాళ!’ అనుకుంటూండగానే ఆమె మెలికలు తిరిగిపోవడం ఆ కుర్రాడు గమనించాడు.

    “అమ్మా! అక్కకేదో అయినట్టుందే….” అన్న ఆ కుర్రాడి కేక విని ఓ భారీ కాయురాలు – అంతంత అంగలతో-వీథిలోకి పరుగున వచ్చింది.

    “చోద్యం చూస్తున్నావేమిట్రా, వెళ్లి రిక్షా కట్టించుకురా!” గర్భిణిని పట్టుకుంటూ కుర్రాణ్ణి గదమాయింది భారీకాయురాలు. “అలాగలాగే…. తిన్నగా ఆస్పత్రికేగా?” అని అడుగుతూనే రోడ్డుమీదికి దూకేశాడు ఆ కుర్రాడు………………

    Buy nowBuy Now
  • regadi vittulu 250 x 375

    Regadivittulu

    250.00

    రామనాథం గుంటూరు జిల్లా రేపల్లెకి చెందిన వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తి. అతని అన్న రత్తయ్య ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. రామనాథం చదువుకుని గవర్నమెంటులో ఆడిటరు ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం మీద మక్కువ గలవాడు. మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డ లో బీడువారిన నల్లరేగడి నేలను చూసిన రామనాథం ఆ భూమిలో వ్యవసాయం చేయాలనుకుంటాడు. సరైన పద్ధతిలో చేస్తే, వ్యవసాయం లాభదాయకమే అని నిరూపించాలని అతని కోరిక. తల్లిని, అన్నని ఒప్పించి, ఉమ్మడి ఆస్తిలో కొంత భాగం అమ్మి, పిల్లల్ని అన్న దగ్గర వదిలి భార్యతో కలిసి నడిగడ్డకి వచ్చిన రామనాథం ఓ దొర దగ్గర పొలంకొని అక్కడ వ్యవసాయం మొదలుపెడతాడు. కొంత కాలానికి, చదువు మానేసి వ్యవసాయంలోకి దిగిన అతని అన్న కొడుకు శివుడు రామనాథానికి తోడుగా వస్తాడు. మరికొంత కాలానికి కుటుంబం మొత్తం నడిగడ్డకి వలస వస్తుంది.

    మంచి విత్తనం మాత్రమే మంచి పంటని ఇవ్వగలదని తెలుసుకున్న రామనాథం తన చదువుని, జ్ఞానాన్ని విత్తనాల తయారీలో ఉపయోగిస్తాడు. వ్యవసాయ శాస్త్రజ్ఞుల సలహాలతో కొత్త రకం పత్తి విత్తనాలు తయారు చేసి వాటికి ‘రేగడి విత్తులు’ అని పేరు పెడతాడు. పత్తి పంటకి గిరాకీ పెరగడంతో ఎక్కడెక్కడి వాళ్ళో నడిగడ్డ లో భూములు కొనడానికి డబ్బుతో వస్తారు. అతనున్న ప్రాంతం రాంనగర్ అవుతుంది.

    ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడే రామనాధం వ్యవసాయంలోనే కాదు జీవితాల తోనూ ప్రయోగాలు చేస్తాడు. తన ఇంటి ఆడపిల్లను ఓ తెలంగాణా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కాలంతో పాటుగా, కొండొకచో కాలం కన్నా ముందుగా మారతాడు రామనాథం. ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది కథ.

    Buy nowBuy Now
  • sri devi bhagavatamu 250 x 375

    Sri Devi Bhagavatam By D Srinivasa Dikshitulu

    126.00

    వేదవ్యాస మహర్షి శ్రీ దేవీ భాగవతమ్

    ప్రథమ స్కంధం

    వినండి… చెబుతాను!

    బ్రహ్మదేవుని ఆదేశానుసారం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు వేదవ్యాసుని శిష్యుడు, సకల పురాణవేత్త అయిన సూత మహాముని ఆ పవిత్ర ప్రదేశానికి వచ్చాడు.

    మహర్షులందరూ ఆ మహాత్మునికి భక్తిశ్రద్ధలతో అతిథిసత్కారాలు చేశారు. సూతుడు దర్భలతో చేసిన చాప మీద కూర్చున్నాడు.

    “సూత మహామునీ ! నువ్వు పురాణాలన్నీ చదివి గురువు అనుగ్రహంతో వాటిలోని రహస్యాలన్నింటినీ చక్కగా ఆకళింపు చేసుకున్నావు. అందుకే నువ్వు చెప్పే పురాణకథల్ని వింటుంటే శ్రోతల రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అందరూ నిన్ను ఆదరంగా ‘రోమహర్షణుడు’ అని పిలవటానికి కారణం అదే.

    మహాత్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావటం మా పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాం. కలియుగ కల్మషాలన్నింటినీ కడిగేసే శ్రీ దేవీ భాగవతాన్ని నువ్వు మాకు చెబితే వినాలని కుతూహలంగా ఉంది” అన్నారు శౌనకాది మహర్షులు……………….

    Buy nowBuy Now
  • 2

    Ade Nela By Mukunda Rama Rao

    600.00

       అనువాద కళని ఆపోసన పట్టిన రామారావు,. యిప్పుడు “అదే నెల” ద్వారా భారతదేశంలోని భిన్నభాషల్లో విలసిల్లిన కవిత్వాల్ని, వాటి చారిత్రక నేపథ్యంలో సహా, మనముందు కుప్పబోసి దేశీయ సాహిత్య ప్రపంచంలోకి తనదైన శైలిలో ఆహ్వానిస్తున్నారు. వందలాది భారతీయ భాషల నుంచి , దాదాపు మూడు వేల మంది కవుల్ని యూ గ్రంధం ద్వారా అయన పరిచయం చేస్తున్నారు. ఏడూ వందలకు పైగా కవితల్ని అనువదించి, దేశంలోని భిన్న జాతుల అస్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తూనే, వాటిమధ్య ఐక్యత కోసం ఒక వారధిని నిర్మిస్తున్నారు. ప్రాంతం, జాతి, భాష యేదైనా దేశంలోని లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్ధం చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి, కాశ్మిరం నుంచి కన్య కుమారి వరకూ, భిన్నకాలాల్లో వెల్లివిరిసిన భారతీయకవిత్వం దోహదపడుతుందని, వైవిధ్యమే యూ దేశపు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, “అదే నెల” గ్రంధం మరోసారి నిరూపిస్తుంది.

                                                                                               -ముకుంద రామారావు.

    Buy nowBuy Now
  • 3

    Adhe Kanthi By Mukunda Ramarao

    700.00

    తమిళ ప్రాంతం

    భక్తి అన్నది తలుపులు మూసుకుని తమకు తామే జరుపుకునే ఒక రహస్య ప్రక్రియలాగ, లేదా బహిరంగంగా అయితే పూజారుల పేరుతో వారి అధీనంలో జరగాల్సిన ప్రక్రియలాగ తయారుకావడంతో బౌద్ధం జైనం ప్రజలకు దగ్గరవుతున్న కాలం అది. బౌద్ధానికి, జైనానికి రాజుల అండదండలు కూడా తోడవటంతో ప్రజలో అసంతృప్తి మొదలయింది. దానిని ఎదుర్కొనేందుకు ‘భక్తి ఉద్యమం’ ఒక సంస్కరణ ఉద్యమంలా ముందుకొచ్చింది.

    సంగం కాలం తరువాత పశ్చిమ దక్కనీ ప్రాంతంలో చాళుక్యులు, కాంచీలోని పల్లవులు, మదురైలో పాండ్యులు (పల్లవ పాండ్య రాజ్యాలు పూర్తిగా తమిళ ప్రాంతంలోనివి) ఆరవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకూ ఒకరితో ఒకరు యుదాలు చేసుకుంటూ దక్షిణ ప్రాంతంలో వారి వారి రాజ్య విస్తీర్ణాల్ని, ప్రాబల్యాల్ని పెంచుకుంటూపోయారు.

    ఎనిమిదవ శతాబ్దం మధ్య భాగానికి రాష్ట్రకూటులు బదామీ చాళుక్యుల్ని ఓడించి బదామీ చాళిక్యుల సామ్రాజ్యాన్ని వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. కాలంతోపాటే సంగం కాలపునాటి దేవుళ్లు కూడా రూపాంతరం చెందారు. అప్పటి మాయన్ ‘విష్ణువు’గా, కురింజి పర్వతాల్లోని శివుని కుమారుడు ‘మురుగన్ స్కంద’ లేదా ‘సుబ్రమణ్యుడు’గా, విజయదేవతగా పూజలందుకున్న కొర్రవై (మురుగన్ తల్లి) శివుని భార్యగా చూడబడింది. అనేక శైవ వైష్ణవ దేవాలయాలు నిర్మాణమయ్యాయి. జైనుల్ని, బౌద్దుల్ని తరిమేసే ప్రయత్నాలు అన్ని వైపులనుండి ముమ్మరంగా సాగాయి. ప్రముఖ శివభక్తుడైన అప్పార్, మొదటి మహేంద్రవర్మన్ (580-630) రాజును జైనం నుండి శైవంలోకి తీసుకురాగలిగాడు.

    భక్తి ఉద్యమం పరిధిలో సంప్రదాయవాదులు, బ్రాహ్మణులు, శూద్రులు, దళితులు, స్త్రీలు అందరూ చేరారు. అది దాదాపు 6వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకూ విస్తరించింది. 6-9 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో రెండు ధార్మిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. శైవారాధకులైన అరవై మూడు మంది ‘నాయనార్లు’, వైష్ణవారాధకులైన పన్నెండు మంది ‘ఆళ్వార్లు’ వారివారి ఆరాధకుల పేరు మీద ఉద్యమాలు తీసుకొచ్చారు.

    ఈ ఉద్యమాలో మొటమొదటిసారిగా అప్పటివరకూ అణచివేయయబడ కులాలవాళు | కూడా ఉండటం విశేషం. ఈ రెండు ఉద్యమాలూ బౌద్ధం, జైనానికి విరుద్ధంగా పనిచేసాయి. సంగమ సాహిత్యంలోని ప్రేమాశౌర్యాలకు, భక్తి విలువల్ని జోడించిన ఆదర్శాల్ని వారు ప్రతిపాదికగా చేసుకున్నారు. సంగమ సాహిత్యంలో శివ, మురుగ, తిరుమల్ ప్రస్తావనలు కనిపిస్తాయి. కానీ ఆ తరువాత భక్తి ఉద్యమ కాలంలో శివుని ప్రాముఖ్యత ఎక్కువగానే ఉన్నా శైవం, వైష్ణవం అంటూ ఏదో ఒకే రూపాన్ని మాత్రమే ఆ ఉద్యమం తీసుకోలేదు. భక్తి కవులు వారు నమ్ముకున్న దైవాలను శృతిబద్దంగా స్తుతిస్తూ గ్రామ గ్రామాలకు తిరుగుతూ ప్రజలను ‘శైవం, వైష్ణవం రెండింటిలోకి వారు తీసుకురాగలిగారు. ధనికులు, వర్తకులు, నైపుణ్యం గల

    అదే……………..

    Buy nowBuy Now
  • 4

    Tejo Tungabhadra By Vasudendra , Ranganadha Ramachandrarao

    425.00

    అర్ధరాత్రి సమయంలో తేజోనది ప్రవాహించే సవ్వడి తప్ప ఇతర సవ్వడులు లిస్బన్ నగరంలో అంతగా వినిపించవు. కొంచెం చెవులు రిక్కించి వింటే దూరంలో సముద్రపు ఘోష మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తుంది. మౌనసరోవరంలో రాయి విసిరినట్టు గంటకొకసారి తప్పనిసరిగా అంతఃపురం గంట సమయం సూచించటానికి చప్పుడు చేస్తుంది. వయసుదాటినవారు ఆ గంట చప్పుడుకు పక్కకు దొర్లుతారు. పిన్నవాళ్ళకు మెలకువ కూడా రాదు. సంవత్సరం నిండిన పసిబిడ్డలు ఒక్కోసారి ఆకలితో మేల్కొని ఏడుస్తారు. తల్లి స్తనం దొరకగానే మిన్నకుండిపోతారు. అంతఃపురంలోని కొన్ని కాగడాలు తప్ప వీధి దీపాలు ఎప్పుడో ఆరిపోయివుంటాయి.

    అదొక వానాకాలపు రోజు. సాయంత్రమంతా వాన కురిసి, మొత్తం నగరాన్నంతా తడిపింది. ఆ వర్షానికి బయటికెక్కడికీ వెళ్ళలేని జనం భోజనం చేసి, పీకలదాకా వైన్ తాగి, తొందరగా నిద్రలోకి జారిపోయారు. అంతఃపురం గంట పన్నెండుసార్లు చప్పుడు చేసి ఇంకా పదిహేను నిముషాలు కూడా కాలేదు. ఆ సమయంలో అంతఃపురం వంటింటి కట్టడం వెనుక భాగం నుంచి, ముఖానికి ముసుగు వేసుకున్న ఒక ఆకారం పిల్లిలా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది. ఆ ఆకారం అటూ ఇటూ చూస్తూ, ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకుంటూ అంతఃపురం ప్రహరీగోడవైపుకు నడవసాగింది. పొడవాటి గుడ్డలో ఏదో మూట కట్టుకుని, దాన్ని నడుముకు చుట్టుకుంది. అప్పుడప్పుడు దాన్ని ముట్టి చూసుకుంటూ………………..

    Buy nowBuy Now
  • 5

    Madam. . . C

    300.00
    Buy nowBuy Now
  • 14

    Charama Raathri

    100.00
    Buy nowBuy Now
  • 17

    Sangati 2

    225.00
    Buy nowBuy Now
  • 19

    ALgorithm

    200.00
    Buy nowBuy Now
  • prpancha cinema charitra

    Prapancha Cinima Charitra

    750.00

    ఇది మానవజాతి చరిత్ర

    మా ఊరి టెంటు సినిమాలో నేను చిన్నప్పుడు చూసిన తెలుగు సినిమానే నాకు మొట్టమొదట తెలిసిన సినిమా. చదువు కోసం మద్రాసు వచ్చిన తరువాత హిందీ, ఇంగ్లీషు సినిమాలు పరిచయమయ్యాయి. చాలా సంవత్సరాల వరకు సినిమాలంటే ఇవే అనే భ్రమలో ఉండేవాణ్ణి. 1951లో మొట్టమొదటిసారి మద్రాసులో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగినప్పుడు తెలిసొచ్చింది సినిమా విశ్వరూపం ఏమిటన్నది. Yukiwariso, Rashomon, Bycicle Theives, Umbrellas of Cherbourg లాంటి సినిమాలు చూసేసరికి ఒక్కసారిగా సినిమాల మీద నాకున్న దృక్పధం పూర్తిగా మారిపోయింది. ఇదొక గొప్ప కళ. మానవజాతిని ముందుకు నడిపించే శక్తి గల కళ. అప్పట్నుంచి, ప్రపంచంలో ఏ ఏ మూల ఏ ఏ సినిమాలు వున్నాయో వెతకటం మొదలుపెట్టాను.

    ఆ సమయంలో Marie Seton మద్రాసు వచ్చారు. ఆమె ఐసెన్స్టీన్ (Eisenstein) శిష్యురాలు. సినిమా మీద ఎంతో పరిశోధన చేసారు. ఆమెను నేను కలిసాను. రష్యన్…………………..

    Buy nowBuy Now