డా . ఆశ్లేష ఈదల ,Ph.D.డిజిటల్ మహీళ Pvt . Ltd . మరియు మిత్ర వాక్ సంస్థల స్థాపకురాలుఆమె ఒక కొన్సిలింగ్ సైకాలజిస్ట్ రచయిత్రి. మరియు డిజిటల్ఎంపపవర్మెంట్ కోచ్ .మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ మరియు డిజిటల్ నైపుణ్యాల మధ్య గ్యాప్ ను తగ్గించి .వారి జీవితాలను మార్చడములో ఆమె చేస్తున్న కృషి ఎంతో విశేషం .ఆమె రూపొందించిన కార్యక్రమములు చాల మందిమహిళలకు మల్లి కెరియర్ ప్రారంభించే అవకాశం ఇచ్చి ఆర్ధికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేసి ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. మరియు ” స్క్రీన్ టు సక్సెస్ అనే దారిని చూపించాయి.
నియంత్రణ… ప్రేమ కాదు!
ఇతరులు మనల్ని నియత్రించాలనుకోవడం ఒక కోణమైతే, మనం ఇతరుల్ని నియంత్రించే ప్రయత్నం చేయడం మరో కోణం. ఇది కూడా అర్థం లేని ప్రయాసే.
ఇది కుటుంభంతోనే మొదలవుతుంది. భార్యభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు … ఒక్కరిపైనా ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు. కొన్నిసార్లు స్నేహం, ప్రేమ పేరుతోనే నియంత్రణ కొనసాగుతుంది. ఏ రూపంలో ఉన్న సరే, నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు. అపనమ్మకాన్ని సాక్ష్యం. నియంత్రణ అనేది ఓ బుడగ ఎదో ఒక సమయంలో ఠప్పున పగిలిపోవడం ఖాయం. ఎదుటి మనిషి, ఎంత ఆత్మీయుడైన సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం, మనం ఆశించిన విధంగానే స్పందిచాలనుకోవడం ఎంత మూర్ఖత్యం వాళ్ళు లోపాల్ని సరిదిద్దగలమని, వాళ్ళ బలహీనతలను దూరం చేయగలమని …… మనకు మనమే
గొప్పలు చెప్పుకోవడం ఎంత విడ్డురం! దీన్నే మానసిక నిపుణులు ‘ కంట్రోల్ ట్రాప్ ‘ గా అభివర్ణిస్తారు . దీని వల్ల అపార్ధాలే మిగుల్తాయి. నియంత్రణతో ఏ మార్పును సాధించలేము. స్ఫూర్తిని నింపడంవల్లే ఆశించిన ఫలితాలు సాధ్యం అవుతాయి. ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి. కొడుకో కూతురో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలనీ కోరుకొనే తండ్రికి .. తిట్లతోనో, శాపనార్ధాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు. అందరికంటే ముందు తనే మేల్కొనాలి . కసరత్తు ఆరంభించాలి. ఏ అత్మియులకో ఇబంధులు ఎదురైనప్పుడు, ఆ సమస్యను వాళ్ళే పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి. పరకాయ ప్రవేశం చేసి …. మనమే పోరాడాలని అనుకోకూడదు. ఎవరి జీవితం వాళ్లదే అయినప్పుడు, ఎవరి పోరాటం వాళ్లదే అని ఆలోచించాలి. జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించాలని కోరుకోకూడదు. అలా ప్రయత్నించిన ప్రతిసారి
ఎదో ఒక ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోపం. అసహనం, ఆత్మన్యూనతా … అది ఏమైనా కావచ్చు. ఏ ఉద్వేగం జీవిత కాలమైనా అరవై సెకన్లే. మనం స్పందిచకపోతే , అవే తోక ముడుచుకొని తుర్రుమంటాయి . కానీ, మనం కోరికోరి నెత్తిన పెట్టుకుంటాం. పెంచి పోషిస్తాం.
అనేక కోణాల్లో
‘లెట్ దెమ్’ సిద్ధాంతాన్ని జీవితంలోని అన్ని కోణాలకు అన్యయించుకోవచ్చు. స్నేహబంధానికి కుడా. ఓ పది మంది ప్రాణ స్నేహితుల పేర్లు అడిగితే. టకటకా చెప్పేస్తాం. అందులో ఏడూ పేర్లు బాల్య స్నేహితులవే కారణం. చిన్నప్పటి స్నేహాలు ‘లెట్ దెమ్ ‘ లిట్మస్ లిస్ట్ లో పాసై ఉంటాయి . ఒకడు అబద్ధాల్లో దిట్ట. ఒకడు అప్పుల అప్పారావు . ఒకడు వ్యసనపరుడు. … అన్ని తెలిసిన మనం వాళ్ళను యధాతదంగా ఆమోదిస్తాం . ఉద్యోగ జీవితం లో అడుగుపెట్టాక మాత్రము…
ఎదుటి వ్యక్తుల్ని భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం . మన అంచనాలకు తగినట్లు వ్యవహరించకపోతే, నిర్మొహమాటముగా దూరం పెట్టేస్తాం. ఇక్కడ ‘లెట్ దెమ్ ‘ సూత్రాన్ని అన్వయించమ్. కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి . ఓ సర్వ్ ప్రకారం … మనిషి ప్రతి పదేళ్లకు యాభై శాతం స్నేహితుల్ని కోల్పోతాడట . కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది. జీవిత భాగస్వామిని యధాతధంగా ప్రేమించాక పోతే …. తన బలహీనతల్ని భరిస్తాం. లోపాలను అర్ధం చేసుకుంటాం, ఆ అవగాహన కరువైనప్పుడు … విడాకులు, బ్రేకులు .
నేహా దీక్షత్ దృఢ మనస్కురాలు . ధైర్యస్తురాలు . సహానుభూతి గలిగిన రచయిత్రి . మనసును హత్తుకు పోయి, పాఠకుడిని కుదిపేసే ఈ పుస్తకం ద్యారా ఆమె అదృశ్యంగా ఉండే సామాన్య భారతీయురాలు మీద వెలుగును ప్రసరించింది . సరళంగా వున్నా ప్రతిభావంతమైన శైలీలో – సామాన్య భారతీయుల జీవితాలను అదృశ్యపు చీకటి నుంచి వెలికి తీసింది . అంతేకాదు -వారిని అవహేళన పూరితమైన జాలి , కనికరంతో కూడిన కలం చెల్లిన కథనాల నుండి బయటపడవేసి -వారి స్యయం నిర్ణయాలకు గౌరవ్ స్తానం ఇస్తుంది. ఈ పుస్తకం , మనల్ని మనం ఏ రకంగా సమర్ధించుకోలేకుండా చేసి , ఈ పుస్తకం అంతర్లీనంగా గాయపరుస్తుంది.
-ప్రతాబ్ భాను మెహ్తా