Quick Service : Contact : 6281596253

No products in the cart.

Sale

Amma Diarylo konni Pageelu

Original price was: ₹220.00.Current price is: ₹200.00.

డబ్లిన్,

24 ఫిబ్రవరి 2023.

నాకో సంగతి చెప్పు… అసలు ఎవరైనా నీకు ఇంతకుముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వు ఎప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను. ఇది అమ్మ ప్రేమకథ.

తలుచుకుంటే నవ్వొస్తుంది. ఒక్కోసారి ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది – ప్రేమతో పెద్దగా పరిచయం లేని నేను ప్రేమకథ చెప్పడం, ప్రేమ కథల్నే చెప్తూ ఉండటం గురించి ఆలోచిస్తే. బహుశా నేను అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. బిడ్డ పుట్టినప్పుడు పెద్దయ్యాక వాళ్ళు ఏమవ్వాలి, ఏ లక్ష్యాలు సాధించాలని ఎవరూ కలలు కనరు. వాళ్ళని చూసి మురిసిపోవడంలోనే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. వాళ్ళు ఎదిగే క్రమంలోనే ఈ ఆశలూ కలలూ మొదలవుతాయి. సరిగ్గా ఇదే జరిగింది నా ఈ కథ విషయంలో. ఎక్కువ విసిగించకుండా చెప్తాను…………..

or
Estimated delivery:April 21, 2025 - April 29, 2025