Quick Service : Contact : 6281596253

No products in the cart.

826 KM ( 826 Kilometer)

200.00

ధార్వాడ్, కర్ణాటక.

అప్పుడప్పుడే చీకటి పడటం కొంచెం కొంచెం మొదలవుతోంది. ఈరోజుకి నా పనైపోయింది, భూమికి అవతలివైపుకు వెళ్ళొస్తానంటూ సూర్యుడు మెల్లగా కిందికెళ్ళిపోతున్నాడు. రోడ్డు వంకర టింకరగా చాలా మలుపులు తిరిగి ఉంది. రెండు వైపులా చెట్లు దట్టంగా ఉన్నాయి. అక్కడ నిలబడి ఎటువైపు చూసినా ముదురు ఆకుపచ్చ రంగు మాత్రమే కనిపిస్తుంది.

అటువంటి రోడ్డు మీద ఒక బైక్ కొంచెం ఊగుతూ వస్తోంది. ఆ సమయంలో ఆ బండిని ఎవరు చూసినా అది కంట్రోల్లో లేదు అని చెప్పగలరు. బండి మీద ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు. అతని కళ్ళు పదేపదే మూతలు పడుతున్నాయి. బ్రేక్ వేయటానికి అతని కాలు సహకరించట్లేదు. ఉన్నపళంగా బండి మీద నుండి దూకనూ లేడు. అంత శక్తి లేదు. బైక్ ఎక్కడోచోట దేన్నో ఒకదాన్ని గుద్దుకుని కిందపడితే తప్ప అతను, ఆ బండి ఆగే అవకాశమే లేదు.

అలా కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు చాలా పెద్ద మలుపు తీసుకుంది. అప్పటికే అదుపు తప్పుతున్న బైక్, ఆ మలుపు కారణంగా సరాసరి వెళ్ళి రోడ్డు పక్కనున్న చెట్టుకి గుద్దుకుంది. కాలికి చెట్టు మొదలు తగలటంతో రక్తం తీవ్రంగా కారుతోంది. చేతిక్కూడా బలమైన గాయం తగిలింది. హెల్మెట్ ఉండటంతో తలకి దెబ్బలేమీ తగల్లేదు, హెల్మెట్ మీద ఉన్న పసుపు రంగు స్టిక్కర్ గీసుకుపోయింది.

రక్తంతో ప్యాంట్ ఒక వైపంతా తడిచిపోయింది. బలాన్నంతా కూడదీసుకుని పైకి లేద్దామని ప్రయత్నిస్తున్నాడు ఆ కుర్రాడు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్నీ విఫలయత్నాలే. ఇంక తన వల్ల కాదని తెలుసుకుని అలా రోడ్డువైపు చూస్తూ ఉండిపోయాడు. కొంతమంది అబ్బాయిలు తన వైపు పరిగెత్తుతూ రావటం అతనికి తెలుస్తోంది. అప్పటికే మూసుకుపోతూ, తెరుచుకుంటూ ఉన్న అతని కళ్ళు ఈ దెబ్బలు………………

or
Categories: Tag:
Estimated delivery:April 21, 2025 - April 29, 2025